Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్లో రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. 'గానా ఆఫ్ రిపబ్లిక్' సాంగ్ లాంచ్ ఈవెంట్ శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. 'రిపబ్లిక్' సినిమాలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఈ సందర్భంగాదర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, 'స్వేచ్చ గురించి చెప్పే సాంగ్. చాలా బావుంది. నిర్మాతలు భగవాన్, పుల్లారావుకి ఇది చాలా పెద్ద సినిమా కావాలి. దేవ్ కట్టా ఇన్టెన్స్ ఫిల్మ్ మేకర్. సింపుల్ ఎక్స్ప్రెషన్ను కూడా ఇన్టెన్స్తో చెబుతారు. అందరినీ ఆలోచింపచేసే పాయింట్‌ను ఈ సినిమాలో చెబుతారని ఆశిస్తున్నాను. ఇక సాయితేజ్‌కి సక్సెస్ వస్తే నాకు సక్సెస్ వచ్చినట్లు ఫీల్ అవుతాను' అని తెలిపారు.
దర్శకుడు దేేవ్ కట్టా మాట్లాడుతూ, 'ఈ సినిమాతో మణిశర్మగారితో ఎప్పట్నుంచో పని చేయాలనే నా కోరిక తీరింది. ఈ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి కొరటాల శివగారి కంటే బెటర్ పర్సన్ మరొకరు ఉండరనిపించింది. లిరిక్ రైటర్ రెహమాన్ మంచి సాహిత్యాన్ని అందించారు' అని చెప్పారు.
'సాయితేజ్‌తో తొలిసారి కలిసి పనిచేస్తున్నాను. అలాగే నిర్మాతలు భగవాన్, పుల్లారావుతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దేవ్ కట్టాగారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది' అని సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు.
హీరో సాయితేజ్ మాట్లాడుతూ, ''గానా ఆఫ్ రిపబ్లిక్' సాంగ్‌ను పెద్ద స్క్రీన్‌పై చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా మా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నాం. దేవ్ కట్టా నాకొక మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమాతో మణిశర్మగారితో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇకపై ఆయనతో చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పారు. 'మా సినిమా ఫస్ట్ సాంగ్ కొరటాల శివగారి చేతుల మీదుగా రిలీజ్ కావడమే పెద్ద సక్సెస్‌గా భావిస్తున్నాం' అని నిర్మాతలు జె.భగవాన్, పుల్లారావు చెప్పారు.