Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం 'నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం నుండి 'చిలిపి చూపుల..చలాకీ చిన్నమ్మీ..' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ఆదివారం విడుదలైంది. తన కొడుకు పెళ్లి చూపులకు వెంకటేష్ కుటుంబం వెళ్లే నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా కార్తీక్ రత్నం నటించారు. ఈ ఫ్యామిలీ పాటకు చిన్న రొమాంటిక్ టచ్‌ని కూడా కలిపి మణిశర్మ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ శ్రావ్యంగా ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ మంచి సాహిత్యాన్ని అందించారు. ఇటీవల సురేష్ ప్రొడక్షన్ ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో మొదటి సినిమాగా 'నారప్ప' సాంగ్స్ విడుదలవుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.