Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సరికొత్త అప్డేట్తో అటు ఎన్టీఆర్, ఇటు రామ్‌చరణ్ అభిమానుల్ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ సర్ప్రైజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎలా చిత్రీకరించారో 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో మేకింగ్ వీడియో గ్లింప్స్‌ని ఈనెల 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మేకింగ్ వీడియోలో చిత్రీకరించిన లొకేషన్లని చూపిస్తారా? లేక సినిమాలోని పాత్రలకి సంబంధించిన సన్నివేశాల్ని చూపిస్తారా? అనేది తెలియాలంటే ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు వేచి చూడాల్సిందే.
ఇక ఈ సినిమా చిత్రీకరణ విషయానికొస్తే, రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయినట్టు ఇటీవల చిత్ర బందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామ రాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ నాయికలు. అజరు దేవ్గన్, శ్రియ, సముద్రకని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.