Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కి సంచలన విజయం సాధించిన చిత్రం 'సురారై పొట్రు'. తెలుగులోనూ 'ఆకాశం నీ హద్దురా'గా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలై ఊహించని రీతిలో అశేష ప్రేక్షకాభిమానాన్ని దక్కించుకున్న ఏకైక సినిమా ఇది. ఈ సినిమాని సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఎయిర్ దక్కన్ అధినేత కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్‌లో చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని హీరో సూర్య అన్నారు.