Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి తొలి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో హై బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంతవరకూ చూడని సరికొత్త అవతారంలో అఖిల్ కనిపించనున్నారు. సోమవారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని, 'ఏజెంట్'గా అఖిల్ బాడీ లాంగ్వేజ్, నటన సిల్వర్ స్క్రీన్‌పై టెర్రిఫిక్‌గా ఉంటుందని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. అలాగే చిత్రీకరణ స్టార్ట్ అయినట్టు తెలియజేస్తూ ఓ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ ఎలా కనిపించబోతున్నాడో ఈ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. అలాగే పక్కా యాక్షన్ థ్రిల్లర్‌కి కేరాఫ్‌గానూ ఉండబోతోందని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతోంది.
'సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్లో గతంలో 'కిక్', 'రేసుగుర్రం' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. తాజాగా వీరిద్దరి కలయికలో 'ఏజెంట్' రూపొందుతోంది. అఖిల్ లాంటి ప్రామిసింగ్ స్టార్, తన దర్శకత్వ ప్రతిభతో సత్తా చాటిన సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ లాంటి విభిన్న రచయిత, ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్-2 వంటి సక్సెస్ఫుల్ బ్యానర్లలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా సర్వత్రా భారీ అంచనాలను పెంచింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా పరిచయం కాబోతుంది' అని చిత్ర బృందం తెలిపింది.