Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రానికి 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైౖటిల్ని మేకర్స్ ఖరారు చేశారు. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఎస్ఎల్వి సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రమిది. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ''రామారావు ఆన్ డ్యూటీ' అంటూ పవర్ఫుల్ టైటిల్ పెట్టిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి ఎనౌన్స్మెంట్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు పొస్టర్స్‌లోనూ రవితేజ ముఖం కనిపించనప్పటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫస్ట్‌లుక్ పోస్టర్లో రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్, ట్రెండీ గాగుల్స్‌తో సూపర్‌స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే నిజాయితీతోపాటు దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా రవితేజ వెండితెరపై మెరవబోతున్నారని వేరే చెప్పక్కర్లేదు. ఈ పోస్టర్లో బి. రామారావుగా ప్రమాణ స్వీకార లేఖ కూడా ఉంది. ఆయనకి కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో చూడొచ్చు. టైటిల్ పోస్టర్ని కూడా అద్భుతంగా డిజైన్ చేశారని ప్రశంసలు లభిస్తున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ యూనిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ, హీరోయిన్లలో ఒకరైన దివ్యాంశ కౌశిక్‌తోపాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం' అని మేకర్స్ తెలిపారు.
నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూధన్ రావు, సురేఖ వాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్యామ్ సీఎస్, సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్, ఎడిటర్: కేఎల్ ప్రవీణ్, ఆర్ట్: సాయి సురేష్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.