Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. సోమవారం ఈచిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ చిత్రీకరణ ఆరంభమైంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది.
ఈ సందర్భంగా చిత్రీకరణ లొకేషన్లో 'అఖండ' గెటప్‌లో ఉన్న బాలకష్ణకు దర్శకుడు బోయపాటి శ్రీను సన్నివేశాన్ని వివరిస్తున్న ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'బాలకష్ణను 'అఖండ'గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌కి సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లోని బాలకష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలోనే మొదటిసారిగా ఓ టీజర్ ఈ స్థాయిలో వ్యూస్ సాధించటం విశేషం. 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' మాదిరిగానే ఈ సినిమా సైతం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది' అని చిత్ర బృందం తెలిపింది.