Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. ఇప్పటికే దుబారులో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. సెకండ్ షెడ్యూల్‌ను సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించి, ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, లొకేషన్లో హీరో మహేష్‌బాబుకి ఓ సన్నివేశాన్ని దర్శకుడు పరశురామ్ వివరిస్తున్న ఓ ఫొటోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
'సర్కారు వారి పాట' టైటిల్‌తో పాటు ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రానికి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న దీనికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు' అని మేకర్స్ తెలిపారు.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్స్ : రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల