Authorization
Mon Jan 19, 2015 06:51 pm
‘మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా? ఇదేం న్యాయం నందాజీ’అంటూ కోర్టులో కొణిదెల సత్యదేవ్ వేసిన కౌంటర్స్ ఇప్పటికీ గోల పెట్టిస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్ మానియా. మూడేళ్ళ విరామం తరవాత మళ్లీ అందరిని అలరించడానికి ఆయన వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లో రిలీజ్ అయ్యి రికార్డులను బద్దలు కొట్టింది - 'వకీల్ సాబ్'. అంకెలతో గుర్తించుకునే సినిమా లెక్కలుతేలేది కొన్నాళ్లలోనే కానీ మనసుకి దగ్గరైన సినిమా జీవితకాలం గుర్తుంటుంది. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను మనకు ఎంతో ఇష్టమైన జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేయనుంది. చాలా సంవత్సరాల తరవాత పవన్ కళ్యాణ్ సినిమా మన జీ తెలుగు లో రాబోతుంది. మరి ఆ సందడి ఎలా ఉంటుందో చూడాలి అంటే ఈ ఆదివారం జులై 18 సాయంత్రం 6:00 గంటలకు తప్పక వీక్షించండి.
మధ్యతరగతికి చెందిన ముగ్గురు అమ్మాయిలు పల్లవి ( నివేదా థామస్), జరీనా (అంజలి ), దివ్య నాయక్ (అనన్య) సిటీకి వచ్చి ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. ఓరోజు రాత్రి క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలసి ఈ ముగ్గురుపై కన్నేస్తారు. వాళ్లని నమ్మించి ఓ రిసార్ట్‌కి తీసుకెళ్లి బలవంతం చేయబోతారు. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పల్లవి వంశీని మందు సీసాతో కొట్టి పారిపోతుంది. అయితే ఎంపీ రాజేంద్ర తన పలుకుబడిని ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై రివర్స్ కేసు పెట్టిస్తారు. ఈ తరుణంలో కేసు గెలవాలని కాకుండా న్యాయం గెలవాలని పోరాటం చేస్తూ.. నాలుగేళ్లు పాటు కోర్టు నుంచి సస్పెండైన వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్)ని కలుస్తారు. వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు యువతుల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు?
జరీనా క్యారెక్టర్ తో అందరిని మెప్పించిన అంజలి మాట్లాడుతూ, “మన దేశంలో ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్న ఒక వాస్తవికతను వకీల్ సాబ్ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రం ద్వారా మహిళలు సామాజిక ఒత్తిళ్లకు లొంగకుండా, ధైర్యంగా ముందడుగు వేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ని మీ కుటుంబంతో తప్పక వీక్షించండి.” ఒక సోల్ ఉన్న కథ ప్రేక్షకుడ్ని ఎప్పుడూ నిరాశపరచదు. వకీల్ సాబ్ చిత్రం కూడా అలాంటిదే. తెరపై వాస్తవ జీవితాన్ని చూపించే చిత్రాలు అరుదుగా వస్తాయి. అనాదిగా స్త్రీ యొక్క ఆలోచనలను, హక్కులను, స్వేచ్ఛని అణిచివేస్తున్న అనేక అంశాల్ని నిక్కచ్చిగా కోర్టు బోనులో నిలబెట్టి నిగ్గుతేల్చాడు వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కంబ్యాక్ సినిమా 'వకీల్ సాబ్' ఈ ఆదివారం 18 జులై సాయంత్రం 6:00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో తప్పక వీక్షించండి