Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై నిర్మితమవుతున్న చిత్రం 'భగత్ సింగ్ నగర్'. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా విదార్థ్, ధవికలను హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వాలాజా క్రాంతి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కి సర్వత్రా విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాతలు వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు మాట్లాడుతూ,' మా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆదరించిన తెలుగు, తమిళ ప్రేక్షకులకు, అభినందించిన సినీ పెద్దలకు కతజ్ఞతలు. మీ ఆదరణతో మరింత ఉత్సాహంతో వినూత్న ప్రొమోషన్లతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తాం. ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఎందుకు 'భగత్ సింగ్ నగర్' అని టైటిల్ పెట్టాల్సి వచ్చిందనేది వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. మా దర్శకుడు వాలాజా క్రాంతి ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు' అని తెలిపారు.
'కథాపరంగా ఆంధ్ర, తమిళనాడు పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని కీలక ఘట్టాలను కేరళ పరిసర ప్రాంతాల్లోనూ చిత్రీకరించాం. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మేకింగ్ విషయంలో మా నిర్మాతలు ఎక్కడా రాజీపడటం లేదు. మా చిత్ర ప్రీ లుక్, ఫస్ట్‌లుక్‌ని ఆదరించినట్టుగానే సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. త్వరలో టీజర్‌ని రిలీజ్ చేస్తాం' అని దర్శకుడు వాలాజా క్రాంతి చెప్పారు. బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజరు గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, నత్యం : ప్రేమ్-గోపి, నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి.