Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కృతి సనన్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మిమీ'. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఈ నెల30 నుంచి జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. పంకజ్ త్రిపాఠి బలవంతంతో ఓ విదేశీ జంటకు సరోగేట్ మదర్‌గా ఉండేందుకు కృతిసనన్ అంగీకరిస్తుంది. సరిగ్గా బిడ్డకు జన్మనిచ్చే టైమ్‌లో ఆ విదేశీ జంట తమకు బిడ్డ వద్దని చెబుతుంది. దీంతో తానొక బిడ్డకు తల్లిననే విషయాన్ని ఇంట్లోవాళ్ళకి చెప్పలేక కృతి పడే ఇబ్బందులు, కృతి విషయాన్ని మేనేజ్ చేసే క్రమంలో పంకజ్ త్రిపాఠి పడే అవస్థలు.. వెరసి ఆద్యంతం ఈ సినిమా వినోదాత్మకంగా ఉండబోతోందని రిలీజైన ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.