Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నూతన దర్శకుడు శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెెరకెక్కిన సినిమా 'ఎస్.ఆర్.కళ్యాణమండపం ఇఎస్టీడీ 1975'. ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్, రాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'టైటిల్ ఎనౌన్స్మెంట్ చేసినప్పట్నుంచీ అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఈ సినిమా ఓ అసక్తిని క్రియేట్ చేసింది. ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ ఆ తర్వాత విడుదల చేసిన 'చుక్కల చున్ని', 'చూసాలే కళ్లార..' వంటి పాటలు యూట్యూబ్‌లో మిలయన్ల వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుదల చేసిన టీజర్‌కి సైతం సర్వత్రా అనూహ్య స్పందన లభించడమే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లోనూ మా చిత్రం హాట్ టాపిక్‌గా మారడం విశేషం. శంకర్ పిక్చర్స్ వారు మా చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.