Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలుగు సినిమా రంగం రామ్గోపాల్ వర్మకి ముందు, రామ్గోపాల్ వర్మ తర్వాత.. అని అంటారనే విషయం తెలిసిందే. అయితే నా కెరీర్ వరకు రామ్గోపాల్ వర్మతో సినిమా తీయడానికి ముందు, తర్వాత అంటాను. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని అంటున్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఆర్జీవి, రామసత్యనారాయణ కాంబినేషన్లో మరో సినిమా నిర్మాణానికి రంగం సిద్ధమైంది.
ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ, '2014లో ఆర్జీవీతో నేను తీసిన 'ఐస్ క్రీమ్' సినిమా నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు నా జాతకాన్నీ మార్చింది. ఆ ఏడాది 'ట్రాఫిక్', 'బచ్చన్', 'వీరుడొక్కడే', 'శీనుగాడి లవ్ స్టొరీ' వంటి అనువాద చిత్రాలు, ధన్ రాజ్-శ్రీముఖిలతో తీసిన స్ట్రయిట్ చిత్రం నిర్మాతగా నాకు మరింత గుర్తింపు తెచ్చాయి. అదే ఏడాది ఆర్జీవితో 'ఐస్ క్రీమ్-2' కూడా తీశాను. లేటెస్ట్గా ఆయన దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాను. మా కాంబినేషన్లో మూడో సినిమా చేయటానికి అంగీకరించిన ఆర్జీవికి ధన్యవాదాలు. నాపై ఆయన చూపించే అపార అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని చెప్పారు.