Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్, ఆర్య నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఎనిమీ'. 'గద్దల కొండ గణేష్' ఫేమ్ మణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా కథానాయకుడు విశాల్ మాట్లాడుతూ,''ఎనిమీ' చిత్రీకరణను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. టీజర్ రిలీజ్‌కి కూడా అన్ని రెడీ అయ్యాయి. 'వాడు-వీడు' సినిమా తర్వాత ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామాన్ ఆర్డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్ అందరికీ ధన్యవాదలు'' అని అన్నారు.
'ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ప్రకాష్‌రాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: టి. రామలింగం, ఎడిటర్: రేమండ్ డెరిక్ క్రాస్టా, యాక్షన్: రవివర్మ.