Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, దర్శకుడు అనీష్కష్ణ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చిత్రీకరణ మంగళవారం హైదరాబాద్లో పున: ప్రారంభమైంది. హీరో నాగశౌర్య, హీరోయిన్ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ని ఎనౌన్స్ చేయబోతున్నారు. నాగశౌర్య నటిస్తున్న ఈ సినిమాతోపాటు 'వరుడుకావలెను', 'లక్ష్య' చిత్రాల షూటింగ్లు కూడా ఇటీవల ప్రారంభం అయ్యాయి.