Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలు సీరియల్స్, సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం నరసింహపురం. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సిరి హనుమంతు కథానాయిక. హీరో చెల్లెలు పాత్రలో ఉష నటించింది. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ చూసి విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ఈ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, ఘన విజయం సాధించడానికి అవసరమైన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్న చిత్ర బృందానికి అభినందనలు. పరిశ్రమ పచ్చగా కళకళలాడాలంటే ఃనరసింహపురంః వంటి తరహా చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందిః అని చెప్పారు. ప్రకాష్‌రాజ్ లాంటి గొప్ప నటుడు మా సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసి చాలా బాగున్నాయని మెచ్చుకోవడం మా కాన్ఫిడెన్స్ లెవెల్‌ని మరింతగా పెంచింది. ఆయనకు మా యూనిట్ తరపున ప్రత్యేక కతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రం ఎంతో అద్భుతంగా రావడానికి కారకుడైన దర్శక, నిర్మాత శ్రీరాజ్ బళ్ళాకి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పారు.