Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాటోగ్రాఫర్‌గా అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన కె.వి.గుహన్ దర్శకుడిగానూ అదే పంథాలో వెళ్తున్నారు. భిన్న కంటెంట్‌తో, తన మార్క్ మేకింగ్ స్టయిల్‌తో అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నంలోనూ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం 'హైవే'. 'ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి' అనేది ట్యాగ్‌లైన్. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాలో మానస రాధాకష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా 'హైవే' చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకష్ణన్ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ, 'గుహన్‌గారి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా మా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బేనర్‌పై సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. హీరో, హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, మానస రాధాకష్ణన్ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీరిద్దరూ కచ్చితంగా ప్రేక్షకుల్ని ఫిదా చేస్తారు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఈ సినిమా తప్పకుండా ఒక సక్సెస్ఫుల్ థ్రిల్లింగ్ మూవీ అవుతుందనే నమ్మకంఉంది' అని చెప్పారు.
చిత్ర దర్శకుడు కె.వి.గుహన్ మాట్లాడుతూ, 'నేను దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది 'హైవే' నేపథ్యంలో సాగే ఒక భిన్నమైన సైకో క్రైమ్ థి¸ల్లర్ చిత్రమిది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్డ్స్‌గా ఉండబోతుంది. సైమన్ కె. కింగ్ మ్యూజిక్ ఈ చిత్రానికి మరో స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది' అని తెలిపారు.