Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొత్త వాళ్ళు నటించారా?, సీనియర్లు నటించారా అనే దానికంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాని, అందులో నటించిన వాళ్లని ఆదరించడంలో మన తెలుగు ప్రేక్షకులకు మించిన వాళ్ళు లేరు. వారి ఆదరణ, అభిమానం వల్లే సినీ పరిశ్రమలో నాకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకోగలిగాను' అని అంటున్నారు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. తొలి సినమా 'రాజావారు రాణిగారు'తోనే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన కిరణ్ అబ్బవరం లేటెస్ట్గా 'ఎస్.ఆర్. కళ్యాణమండపం ఈఎస్టీడీ 1975' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల్లో నటించే బంపర్ ఆఫర్లని దక్కించుకున్నారు.
బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూడు కొత్త చిత్రాల వివరాలను, విశేషాలను మీడియా సమావేశంలో కిరణ్ అబ్బవరం తెలిపారు. 'సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశాను. ఎన్నో ప్రయత్నాల ఫలితంగా 'రాజావారు-రాణిగారు' చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. మంచి కథ, కథనంతోపాటు నా నటన నచ్చడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. అంతేకాదు మంచి కథలను ఎంచుకుంటే మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందనే భరోసాని కూడా ప్రేక్షకులు నాకు అందించారు. ఆ ప్రోత్సాహంతోనే కొంత గ్యాప్ తీసుకుని 'ఎస్.ఆర్. కళ్యాణమండపం' చిత్రంలో నటించా. అలాగే ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా అందించాను. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పబ్లిసిటీ కంటెంట్‌కి మంచి స్పందన లభించింది. దీంతో టాలీవుడ్లోనే క్రేజీ ప్రాజెక్ట్‌గా గుర్తింపు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 6వ తేదీన ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాతోపాటు 'సెబాస్టియన్', 'సమ్మతమే' చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు, వీటిలో నా పాత్రలు వేటికవే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వీటితోపాటు హీరోగా 5వ చిత్రాన్ని కూడా అంగీకరించాను. మూసధోరణికి చెక్ పెట్టాలన్నదే నా లక్ష్యం. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను అలరించాలన్నది నా డ్రీమ్. అందుకే ఎంచుకునే కథలు, వాటిల్లో పాత్రలు ఫ్రెష్‌గా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాను. మంచి పాత్రలతో అలరించాలనే నా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను' అని కిరణ్ అబ్బవరం అన్నారు.