Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం' చిత్రంతో శ్రీవాస్ దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన 'లౌక్యం' సినిమా సైతం సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. లేటెస్ట్గా ఈ కాంబోలోనే మరో సినిమాకి రంగం సిద్ధమైంది. గోపీచంద్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రమిది. ఈ చిత్రాన్ని పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నయా చిత్రాన్ని బుధవారం ఎనౌన్స్ చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది. 'కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి, జనం రద్దీతో బాగా ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కతాలోని కాళీమాత విగ్రహం కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరంగా తెరకెక్కబోతోందని ఈ పోస్టర్ చెప్పకనే చెప్పింది. గోపీచంద్, శ్రీవాస్ క్రేజీ కాంబినేషన్‌ను దష్టిలో పెట్టుకుని భూపతిరాజా మంచి కథ అందించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో రూపొందిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉండనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న 'పక్కా కమర్షియల్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట.