Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్, లింగుసామి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ఇటీవల ఆరంభమైన విషయం విదితమే. బుధవారం కూడా రామ్‌తో సహా యూనిట్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ పనిలో ఉండగా, సడన్‌గా స్టార్ డైరెక్టర్ శంకర్ లొకేషన్‌కి విచ్చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన శంకర్‌కి యూనిట్ సభ్యులందరూ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, 'సోమవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కతి శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్‌గా సెట్స్‌కు వచ్చిన అగ్ర దర్శకుడు శంకర్ గారిని చూసి, టీమ్ అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఆయనకు రామ్, కతి, నదియా, లింగుసామి ఘనంగా స్వాగతం పలికారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన లవ్ సాంగ్ ట్యూన్‌ని ఆయనకు వినిపించాం. మెలోడీయస్‌గా, చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది' అని తెలిపారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు.