Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తననెంతో బాధపెట్టాయని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడారు. ''నారాయణమూర్తికి ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. బండి లేదు. ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తారు..' అని చెప్పారు. అయితే.. గద్దర్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది 'నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారు' అని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ఫార్వాడ్ చేశారు. దీనిపై నారాయణమూర్తి స్పందిస్తూ, 'చాలామంది ఆర్థికంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫోన్లు చేసి చెబుతున్న మాటలు నన్ను మానసికంగా కుంగదీశాయి. నేను దీనస్థితిలో లేను. నా దగ్గర డబ్బు ఉంది. నాకు ఏదైనా అవసరం వస్తే పరిశ్రమ పెద్దలతో పాటు ఎంతోమంది నాకు సహాయం చేస్తారు. అన్నింటికీ మించి ప్రేక్షక దేవుళ్లు నన్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తారు. సినిమా అన్నాక అప్పులు చేయడం.. తీర్చడం చాలా సహజం. సినిమాలు చేసి స్థలాలు కొనుక్కొని.. ఇంకా ఏదో చేసే మనస్తత్వం నాది కాదు. 'రైతన్న' సినిమాని కూడా ఎప్పుడు విడుదల చేద్దామా అని ఆతతగా ఉన్నాను' అని నారాయణమూర్తి అన్నారు.