Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా రూపొందుతున్న చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 80 శాతం పూర్తయింది. గురువారం హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ఈచిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
'గ్రామీణ వాతావరణంలో ఉన్న ఓ ఇంటి వరండా కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ, నవ్వుతున్న యవకుడిగా కిరణ్ అబ్బవరం, అతన్ని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్న చాందిని చౌదరితో ఉన్న పోస్టర్ అందర్నీ అలరిస్తోంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమాలో కిరణ్ అబ్బవరం కల ఏంటో ఆడియన్స్‌కు అవగాహన కలిగించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారని వేరే చెప్పక్కర్లేదు. అలాగే కిరణ్ అబ్బవరం పట్ల చాందినీ ప్రేమ ఫస్ట్‌లుక్ పోస్టర్లో క్లియర్‌గా కనిపిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: కనకాల ప్రవీణ, మ్యూజిక్ డైరెక్టర్: శేఖర్ చంద్ర, డీఓపీ: సతీష్‌రెడ్డి మాసం, ఎడిటర్: విల్పావ్ నిషాదం, ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.