Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న చిత్రం 'సెబాస్టియన్ పిసి524'. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రమోద్, రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ కథానాయికలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బర్త్‌డే లుక్‌ని విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాతలు ప్రమోద్, రాజు మాట్లాడుతూ, 'మా హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బర్త్-డే లుక్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. క్రిస్మస్ కానుకగా విడుదలైన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. మా హీరో నటిస్తున్న 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు' అని చెప్పారు. 'పోలీస్ సెబాస్టియన్ పాత్రలో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. రేచీకటి ఉన్న వ్యక్తిగా నటించడం అంత సులువు కాదు. అయినప్పటికీ ఆయన చాలా బాగా చేశారు. జిబ్రాన్ సంగీతం మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని అద్భుతంగా చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది' అని దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి అన్నారు.