Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు రాజమౌళి తన మార్క్ మేకింగ్‌తో అందర్నీ మరోమారు మెస్మరైజ్ చేశారు.
'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్'
అంటూ గురువారం రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో సన్నివేశాల చిత్రీకరణ, లొకేషన్లు, నటీనటుల నటన, చిత్ర యూనిట్ పడిన కష్టాన్ని స్పష్టంగా చూపించారు.
కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ పాత్రలు అద్భుతంగా ఉండబోతున్నాయనే విషయాన్ని ఈ మేకింగ్ వీడియో చెప్పకనే చెప్పింది. ఇక దర్శకుడు రాజమౌళి తన మేకింగ్ మాయాజాలంతో 'బాహుబలి'కి మించి అనేలా చేశారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నాయిక అలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించారు. అజరుదేవగన్, సముద్రకని, శ్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో ఫిక్షనల్ పీరియాడిక్ నేపథ్యంలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.