Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నటీనటులతో కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై షకీల నిర్మాతగా 'అట్టర్ ప్లాప్', 'రొమాంటిక్' చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాల టైటిల్ పోస్టర్స్‌ను శుక్రవారం షకీల రిలీజ్ చేశారు. వీటికి రమేష్ కావలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా షకీల మాట్లాడుతూ, 'దర్శకుడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాల కథలు నాకెంతో నచ్చాయి. కొత్త వాళ్ళతో చేస్తున్న ఈ రెండు సినిమాల్లోనూ నా కూతురు మిలా హీరోయిన్గా నటిస్తోంది. గోవాలోని అద్భుతమైన లోకేషన్స్‌లో షూటింగ్ చేస్తున్నాం. మేం తీసిన 'లేడీస్ నాట్ ఎలౌడ్' సినిమాకి సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసినప్పటికీ లాభం కనిపించలేదు. దీంతో మేమే 'కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్' పేరుతో ఓటీటీని స్టార్ట్ చేస్తున్నాం' అని చెప్పారు.