Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ స్థాయి గుర్తింపు సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. విశేష ప్రేక్షకాదరణ పొందిన 'బాహుబలి', 'బాహుబలి2' చిత్రాలను ఓ వెబ్‌సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో రాజమాత శివగామిగా నటించేందుకు నయనతార గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం. 'బాహుబలి' వంటి సెన్సేషనల్ హిట్ సాధించిన సినిమా వెబ్ సిరీస్‌తో నయనతార తొలిసారి డిజిటిల్ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. పలు భాషల్లో రూపొందబోయే ఈ వెబ్‌సిరీస్‌కి ప్రవీణ్ సత్తారు, దేవ్‌కట్టా దర్శకత్వం వహించనున్నట్టు వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్‌సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది.