Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వి.వి.వినాయక్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి' చిత్రానికిది హిందీ రీమేక్. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, రమా రాజమౌళి కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. రైటర్ విజయేంద్ర ప్రసాద్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్ డైరెక్టర్ ధవల్ జయంతిలాల్ గడ మాట్లాడుతూ, 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వినాయక్ కాంబినేషన్లో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. మా కాంబినేషన్ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. అంతేకాదు మా కాంబినేషన్ ఇండియన్ సినిమాలో ఓ హిస్టరీని క్రియేట్ చేస్తుందని నమ్మకంగా చెబుతున్నాం' అని చెప్పారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో డా. జయంతిలాల్ గడ సమర్పకుడిగా ధవల్ జయంతిలాల్ గడ, అక్షరు గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్ మరుదూర్ సినీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 'ఛత్రపతి' చిత్రానికి కథ అందించిన కె.వి.విజయేంద్రప్రసాద్ ఈ రీమేక్ కోసం బాలీవుడ్ నేటివిటికి తగ్గట్లు కథలో మార్పులు చేర్పులు చేశారు. రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమా సెట్ వేసిన లొకేషన్లోనే 'ఛత్రపతి' సినిమా హిందీ రీమేక్ కోసం ఓ పెద్ద సెట్‌ను క్రియేట్ చేశారు. శుక్రవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ఆరంభమైంది.