Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న చిత్రం 'బార్సు'. ఈచిత్ర టీజర్‌ను ఇటీవల బాలీవుడ్ నాయిక సన్నీలియోన్ విడుదల చేశారు. దీనికి అనూహ్య స్పందన లభిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే 'రాజా హే రాజా..' అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీమణి రాసిన ఈ పాటకు స్మరన్ అత్యద్భుతంగా సంగీతం సమకూర్చారు. అదే స్థాయిలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. ఇక లేటెస్ట్గా బాలీవుడ్ సెన్సేషన్ సన్నీలియోన్ రిలీజ్ చేసిన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు దయానంద్ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీగా రెడీ చేశారనే విషయం ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఓ పక్క కథానాయికగా ఈ సినిమాలో నటిస్తూనే, మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా మిత్ర శర్మ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు' అని చెప్పారు.