Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెజీనా, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ 'అన్యాస్ టూటోరియల్'. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ఆర్కా మీడియా బ్యానర్లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. 'ఆత్మల నేపథ్యంలో ప్రేక్షకులను భయపెట్టే హర్రర్ వెబ్‌సిరీస్ ఇది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. దీన్ని మా 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నాం' అని అల్లుఅరవింద్ చెప్పారు.
రెజీనా మాట్లాడుతూ, 'ఈ కథ విన్నప్పుడు నేనెలా థ్రిల్ అయ్యానో, అలాగే ప్రేక్షకులు కూడా అవుతారని ఆశిస్తున్నా' అని అన్నారు. 'ఏదో ఒకరోజు నేను, అరవింద్‌గారు కలిసి 'బాహుబలి' రేంజ్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తాం. ప్రేక్షకుల్ని ఆద్యంతం భయపెట్టే వెబ్‌సిరీస్ ఇది. ఏడు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ వ్యవధి ముప్పై నిమిషాలు. క్రిస్మస్ కానుకగా దీన్ని విడుదల చేస్తాం' అని శోభు యార్లగడ్డ తెలిపారు.