Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన చిత్రం 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ కుమార్ కె. దర్శకుడు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ, 'మా నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో ఈ సినిమాని అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించాం. మా చిత్రాన్ని చూసి సెన్సార్ సభ్యులు అభినందించారు. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్ హిట్ సినిమాలను విడుదల చేసిన పీవీఆర్ సంస్థ రిలీజ్ చేస్తుంటడం సంతోషంగా ఉంది. ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. ఇప్పటికే రిలీజైన మా సినిమాలోని పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో కూడా ప్రేక్షకులు ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని చెప్పారు. సంజరు స్వరూప్, గురురాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేశ్ బానెల్, సంగీతం: కార్తిక్ కొడగండ్ల, ఎడిటర్: పి.మహేశ్.