Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్ళి, వాటి పరిష్కారానికి కషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణా స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పలువురు ఎగ్జిబిటర్లు శనివారం మంత్రి తలసానిని కలిసి థియేటర్ వ్యవస్థను రక్షించాలంటూ ఓ వినతిపత్రాన్ని అందజేశారు. 'కరోనా మహమ్మారి కారణంగా సంవత్సర కాలంగా సినిమా థియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయి. దీంతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచి, ఆదుకోవాలి. ముఖ్యంగా థియేటర్లు మూసివేసిన కాలానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి. సింగిల్ స్క్రీన్ థిóయేటర్స్‌లో వెహికల్ పార్కింగ్ ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలి. జీఎస్టీ ట్యాక్స్ రద్దు చేయాలి. జీవో 75ను పునరుద్దరించి, చిత్రీకరణ అనుమతులకు వసూలు చేసే ఛార్జీలను తగ్గించాలి. సాధ్యమైనంత త్వరగా థియేటర్లను తెరవడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి' వంటి అంశాలను ఎగ్జిబిటర్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే, తెలంగాణాలో ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో థియేటర్లను ఓపెన్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి. వాటి నమ్మవద్దని, థియేటర్ల ఓపెనింగ్‌పై క్లారిటీ రాలేదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.