Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కథానాయకుడు గోపీచంద్. ఆగస్ట్ 3వ తేదీతో ఇరవై సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గోపీచంద్ పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన హీరోగా తెరంగేట్రం చేస్తూ నటించిన 'తొలివలపు' చిత్రం ఆగస్ట్ 3న (2001) విడుదలైంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని గోపీచంద్‌కు కంగ్రాట్స్ చెబుతూ 'పక్కా కమర్షియల్' చిత్ర బృందం ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది.
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో 'పక్కా కమర్షియల్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీవాసు నిర్మాత. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు అల్లు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోల్లో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
'రెండు దశాబ్దాల సక్సెస్ఫుల్ జర్నీని మా కథానాయకుడు గోపీచంద్ పూర్తి చేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్‌ను దర్శకుడు మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుటికే విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. 'భలే భలే మగాడివోరు', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే' లాంటి విజయాలతో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో సర్వత్రా భారీ అంచనాలు పెరిగాయి. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి 'భలేభలే మగాడివోరు' , 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. 'ప్రతి రోజు పండగే' సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జకేస్ బీజారు సంగీతాన్ని అందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, సహ నిర్మాత - ఎస్కేఎన్, ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భవ్, సినిమాటోగ్రఫి - కరమ్ చావ్ల.