Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నారప్ప' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నామని తెలిసి, చాలా మంది నా ఫ్యాన్స్ బాధపడ్డారు. అందుకు వాళ్ళందరిని క్షమించమని అడుగుతున్నా. కరోనా పరిస్థితుల కారణంగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం' అని వెంకటేష్ చెప్పారు.
వెంకటేష్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'నారప్ప'. ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ, 'గతంలో ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించి నప్పటికీ 'నారప్ప' మాత్రం చాలా కొత్తగా అనిపించింది. ధనుష్ పోషించిన 'నారప్ప' పాత్ర నాకు సవాల్ విసిరింది. చాలా కాలం తర్వాత సాలిడ్ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, గెటప్ అన్నీ చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. అందుకే 'నారప్ప' పాత్ర కోసం మేకప్ లేకుండా నటించా. అలాగే 50 రోజుల పాటు హౌటల్ రూమ్‌లో అదే గెటప్‌లో ఉన్నా. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. ఈ కథను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మార్పులు చేశారు. మణిశర్మ మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. నా కెరీర్లో ది బెస్ట్ ఈ సినిమాకి ఇచ్చాననిపించింది. ప్రస్తుతం 'దృశ్యం2', 'ఎఫ్3'లతో పాటు తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా చేయబోతున్నా. నా కెరీర్లో 100 సినిమాలు చేస్తానా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కరోనా మనందరికీ గుణపాఠం నేర్పింది. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి' అని అన్నారు.