Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరవింద సమేత' చిత్రంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ జోడీ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజాని ఎంపిక చేశారని వినిపిస్తోంది. పూజా ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', రామ్‌చరణ్ సరసన 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తోంది.