Authorization
Mon Jan 19, 2015 06:51 pm
74వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ ఏడాది 'టైటానే' చిత్ర దర్శకురాలు జూలియా డుకోర్నౌ ప్రతిష్టాత్మక గోల్డెన్ ఫామ్ (పాల్మె డి ఓర్) అవార్డుని అందుకున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవ చరిత్రలో గోల్డెన్ ఫామ్ అవార్డుని సొంతం చేసుకున్న రెండవ మహిళా దర్శకురాలిగా జూలియా డుకోర్నౌ నిలవడం విశేషం. 1993లో 'ది పియానో' చిత్ర దర్శకురాలు జానే కాంపియన్ తొలిసారి ఈ ప్రతిష్టాత్మక గోల్డెన్ ఫామ్‌ని దక్కించుకున్నారు.
శనివారం లాస్ ఏంజిల్స్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైభవంగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హాలీవుడ్ స్టార్ షరాన్‌స్టోన్ చేతుల మీదుగా దర్శకురాలు జూలియా డుకోర్నౌ గోల్డెన్ ఫామ్ అవార్డుని అందుకున్నారు. ఈ యేడాది ప్రముఖ హాలీవుడ్ నటుడు స్పైక్ లీ అధ్యక్షతన 8 మంది సభ్యులున్న జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. అయితే ఈ కార్యక్రమ ప్రారంభంలో వ్యాఖ్యాత అవార్డుల గురించి తెలియజేయమని అధ్యక్షుడు స్పైక్ లీని అడగ్గా, ఆయన వెంటనే గోల్డెన్ఫామ్ విజేతని ఎనౌన్స్ చేసి, తప్పు చేశారు. ఈ అవార్డుని చివరలో ఎనౌన్స్ చేయాలి. అన్నింటికంటే ముందు హానరరీ పాల్మె డి ఓర్ (గోల్డెన్ ఫామ్)ని దక్కించుకున్న సినీ ప్రముఖుడిని ప్రకటించాలి. అలాంటిది గోల్డెన్ ఫామ్ విజేత జూలియా పేరుని ప్రకటించి అధ్యక్షుడు స్పైక్ లీ నాలుక్కర్చుకున్నారు. పెద్ద తప్పు చేశాననే భావనతో ఆయన చాలా సేపు తలపట్టుకుని కూర్చుకున్నారు. అయితే ఆయన తప్పుని జ్యూరీ సభ్యులు, ఆహుతులందరూ స్పోర్టీవ్‌గా తీసుకోవడంతో అక్కడి వాతావరణం తేలికపడింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక హానరరీ పాల్మె డి ఓర్ పురస్కారాన్ని ప్రముఖ ఇటాలియన్ దర్శకుడు మార్కో బెల్లూచీకి అందజేశారు. సినీ పరిశ్రమకు చేసిన విస్తృత సేవలకుగానూ ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇక ప్రతి ఏడాది కేన్స్ రెడ్ కార్పెట్‌పై అందాల తారలు చేసే హంగామా ఈ ఏడాది కోవిడ్ కారణంగా తగ్గడంతో పెద్దగా జోష్ కనిపించలేదు.
74వ కేన్స్ చలన చిత్రోత్సవ విజేతలు.. పాల్మె డి ఓర్ (గోల్డెన్ పామ్): టైటానే ( జూలియా డుకోర్నౌ , ఫ్రాన్స్), గ్రాండ్ ప్రిక్: 'ఏ హీరో' (అష్గర్ ఫర్హాది, ఇరాన్), కంపార్ట్మెంట్ నెం.6 (జుహో కుయోస్మానెన్, ఫిన్లాండ్), బెస్ట్ డైరెక్టర్: లియోస్ కారాక్స్ (అన్నెట్) - ఫ్రాన్స్, జ్యూరీ ప్రైజ్: ఏహెడ్స్ మోకాలి, మెమోరియా, ఉత్తమ నటుడు: కాలేబ్ లాండ్రీ జోన్స్ (నైట్రామ్ - అమెరికా), ఉత్తమ నటి: రీనేస్వ్ రెనేట్ ( వరల్డ్ పర్సన్ ఇన్ ది వరల్డ్), బెస్ట్ స్క్రీన్‌ప్లే: హమాగుచి ర్యుసుకే, తకామాసా ఓ (డ్రైవ్ మై కార్ - జపాన్).