Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ముఖ్య తారాగణంగా నటించిన చిత్రం 'డియర్ మేఘ'. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని 'ఆమని ఉంటే పక్కన..' అనే పాటను కథానాయిక పూజా హెగ్డే విడుదల చేసి, చిత్ర బృందం ఆల్ ది బెస్ట్ చెప్పారు.
'ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్ పై చిత్రీకరించిన అందమైన ప్రేమ పాట ఇది. 'ఆమని ఉంటే పక్కన...ఏమని చెప్పను భావన...పోతే మళ్లీ రాదనా..' అంటూ సాగే ఈ పాటను కష్ణకాంత్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడారు. హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ చేసిన ఈ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ఆగస్టులో థియేటర్స్లో విడుదలకు సిద్ధమవుతోంది' అని మేకర్స్ తెలిపారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - కె.వి రమణ.