Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి, మన భారతదేశ జెండాని రెపరెప లాడిచేందుకు మన దేశ క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. వీరిలో మరింత పోరాట పటిమను, ఉత్సాహాన్ని నింపేందుకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహ్మాన్ 'హిందూస్థానీ వే' పేరుతో ఓ పాట రూపొందించారు.
రచయిత్రి, గాయని అనన్య బిర్లాతో రెహ్మాన్ చేసిన ఈ పాట ఇప్పటికే విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఈ పాట గురించి రెహ్మాన్ మాట్లాడుతూ, 'ఒలింపిక్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపే ఓ పాటను చేయాలనుకున్నాం. గాయని అనన్య ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు' అని తెలిపారు. 'చాలా దేశాలు తమ క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ప్రత్యేకంగా పాటలను రూపొందించాయి. మన దేశ క్రీడాకారుల కోసం ఒక పాట రాయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే సంబంధిత మంత్రిత్వశాఖతో మాట్లాడాను. వాళ్లు అంగీకరించడంతో వెంటనే రెహ్మాన్గారిని సంప్రదించాను. నా తపన గుర్తించిన ఆయన అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. మన క్రీడాకారులందరూ పతకాలు సాధించి మన దేశ కీర్తిని పెంచాలని ఆశిస్తున్నాను' అని గాయని రచయిత, గాయని అనన్య చెప్పారు.