Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన మరో నాయికగా మలయాళ నటి రాజీషా విజయన్ని ఎంపిక చేశారు. కథానుగుణంగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించడానికి స్కోప్ ఉంది. 'మజలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఇప్పటికే ఒక హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.