Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఘాజీ', 'అంతరిక్షం' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఈ మధ్యకాలంలో 'పిట్టకథలు' యాంథాలజీలో ఓ కథకి డైరెక్ట్ చేసిన ఆయన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్‌తో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని చేయబోతున్నారు. 'ఐబి 71'గా టైటిల్ ఖరారైన ఈ చిత్రానికి విద్యుత్ జమ్వాల్ హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా.
విద్యుత్ జమ్వాల్ ప్రొడక్షన్ హౌస్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతూ ఆయన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జమ్వాల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. భారత్‌ని దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ ఎలాంటి ప్లాన్స్ వేసింది?, వాటిని కనిపెట్టి సీక్రెట్ ఏజెంట్ ఎలా మన దేశానికి చేరవేశారనే అంశాలతో ఈ సినిమా ఉండబోతోందని జమ్వాల్ అధికారికంగా తెలిపారు.