Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్లో భాగంగా ఇప్పటికే డైలాగ్ రైటర్‌గా సాయిమాధవ్ బుర్రా, మెయిన్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ని చిత్రబందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించ బోతున్నారని సోమవారం మేకర్స్ తెలిపారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ నిర్మించిన 'వైశాలి'(ఈరం) చిత్రంతోనే తమన్ సంగీత దర్శకుడిగా కెరీర్‌ని స్టార్ట్ చేశారు. 'శంకర్‌గారు నిర్మించిన 'వైశాలి' (ఈరం) తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు అలాంటి గొప్ప డైరెక్టర్‌తో కలిసి పనిచేయడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది' అని తమన్ చెప్పారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ రికార్డింగ్ పనిని హైదరాబాద్‌లో ఈ నెల 14వ తేదీన తమన్ ప్రారంభించారు. శంకర్ ఆధ్వర్యంలో 135 మంది మ్యూజిషియన్స్‌తో తమన్ ఈ పాటని రికార్డ్ చేయటం విశేషం. ఇందులో భాగమైన రామ్‌చరణ్, పాట విని చాలా ఎగ్జైట్‌గా ఫీలయ్యారని చిత్ర బృందం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 50వ చిత్రంగా దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాత.