Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన మా 'అహం బ్రహ్మాస్మి' వెబ్ సిరీస్‌కి మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది' అని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సిరీస్‌కి సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వం వహించారు. పెనుగొండ పద్మావతి, పెనుగొండ హర్షవర్ధన్, స్వామి వెంకట సంపత్ కుమార్, శ్రీకాకుళం సూర్య నిర్మాతలు. 11 భాగాలుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్ (యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్ (యూకే), ఎమ్.ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్, విఐ వంటి తదితర ఓటటీి ప్లాట్‌ఫామ్స్‌పై స్ట్రీమింగ్ అవుతూ మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'డేంజరస్ వెబ్ గేమింగ్ నేపథ్యంలో రూపొందిన సిరీస్ ఇది. అనూహ్యమైన మలుపులతో, ఆద్యంతం అద్భుతమనిపించే స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించాం. మా వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్, టీజర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన వై రవికుమార్, ట్రైలర్‌ను సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ నారాయణదాస్ నారంగ్ విడుదల చేసి, సిరీస్ చాలా బాగుందని ప్రశంసించారు. ఆ ప్రశంసల్ని నిజం చేస్తూ ప్రేక్షకులు సైతం బాగా ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అని చెప్పారు. రజత్ రాఘవ్, మౌనిమ, అభరు బేతగంటి, చాందినీరావు, సాయికేతన్రావు, కష్ణతేజ తదితరులు నటించిన ఈ సిరీస్‌కి సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై, సంగీతం : డెన్నిస్ జాక్, ఎడిటర్: అశ్వత్ శివకుమార్, ఆర్ట్ డైరెక్షన్: ధన్విగేష్ ఆమూరి.