Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంధాథున్, బాలా, గులాబో సితాబో, ఆర్టికల్ 15 వంటి తదితర భిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా ఈసారి 'డాక్టర్ జీ'గా కనిపించబోతున్నారు. ల్యాబ్కోట్ ధరించి, చేతిలో గైనకాలజీ పుస్తకంతో డాక్టర్ ఉదరుగుప్తా అంటూ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, 'డాక్టర్ జీ ! షూటింగ్‌కి సిద్ధమయ్యాడు' అంటూ క్యాప్షన్‌ని ఆయుష్మాన్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. కాలేజీ క్యాంపస్ కామెడీ, డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో హీరోయిన్గా రకుల్ ప్రీత్‌సింగ్ నటించనుంది. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది.