Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్ బాబు హీరోగా కె.ఎస్. క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'బజార్ రౌడీ'. బోడెంపూడి కిరణ్‌కుమార్ సమర్పణలో డి.వసంత నాగేశ్వరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ,'ఈ చిత్ర కథ కి సంపూర్ణేష్ బాబు స్టైల్‌ని జత చేసి ఫ్యామిలి ఎంటర్టైనర్గా చిత్రాన్ని తీర్చిదిద్దార. దర్శకుడు నాగేశ్వరావు తన అనుభవాన్ని మొత్తం తెరపై ప్రజెంట్ చేశారు. షియాజీ షిండే, పథ్వి, నాగినీడు, షఫి, సమీర్ లాంటి అగ్ర నటీనటుల నటన, జాషువా మాస్టర్ ఫైట్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. అలాగే ఇప్పటి వరకు విడుదల చేసిన సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్‌కి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని అగష్టులో థియేటర్లలోనే విడుదల చేయనున్నాం' అని తెలిపారు. 'బర్నింగ్ స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో ఓ మంచి స్థానం సొంతం చేసుకున్న సంపూని ఆయన అభిమానులు ఆశించే రీతిలో చూపించబోతున్నాం. అలాగే ప్రేక్షకులకు నవ్వులు, పాటలు, ఫైట్స్ ఇలా.. కిక్కిచ్చే అన్ని హంగులతో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఇటీవల మా సినిమా ఫస్ట్ కాపీ చూసిన మా నిర్మాత చాలా ఆనందంగా ఉన్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుంది' అని దర్శకుడు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్ అలవలపాటి మాట్లాడుతూ,'పెద్ద చిత్రాలకి దీటుగా ఈ చిత్రాన్ని ఈ అగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని అన్నారు.