Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనిల్ కథానాయకుడిగా ఓ భిన్న కథతో రూపొందబోయే చిత్రం మంగళవారం ఫిల్మ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో లాంఛనంగా ఆరంభమైంది. అఖిల్ విజన్ మూవీస్ పతాకంపై నిర్మితమయ్యే ఈ సినిమాతో తెలుగు చిత్ర సీమకు ఇంద్రకంటి మురళీధర్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫణికుమార్ అద్దేపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా ఆరంభం సందర్భంగా హీరో అనిల్‌పై చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కు పారిశ్రామికవేత్త మహేష్ పటేల్ క్లాప్ నివ్వగా, ఎడిట్ పాయింట్ అధినేత ఇప్పలపల్లి రమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈనెల 26 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్ర ప్రివ్యూ డేట్‌ను నవంబర్ 19గా నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ ప్రకటించడం విశేషం.