Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ 'జ'. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను యువ కథానాయకుడు సుధీర్‌బాబు విడుదల చేసి, యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భంగా నాయిక హిమజ మాట్లాడుతూ, 'నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాని అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి, దర్శకుడు సైదిరెడ్డికి కతజ్ఞతలు' అని చెప్పారు. దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ, ''జ' అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న చిత్రమిది. మా నిర్మాత నా మీద నమ్మకంతో ధైర్యంగా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది' అని తెలిపారు. ప్రీతి నిగమ్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: శివకుమార్. జి, సంగీతం: వెంగి, ఎడిటర్: ఆనంగ్ పవన్, యాక్షన్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ : భాను, సన్నీ.