Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ అగ్నివేశ్, రేఖ నిరోషా జంటగా రూపొందుతున్న చిత్రం 'ఇక్షు'. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఋషిక దర్శకత్వంలో హనుమంతురావు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర ప్రోమోకి సినీ పెద్దలనుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా నిర్మాత హనుమంత నాయుడు మాట్లాడుతూ,'గతంలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్, ఎన్టీఆర్ డైలాగ్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఐదు భాషల్లో విడుదల చేసిన ప్రోమోకి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. మా ప్రోమోని చూసిన కొంతమంది సినీ పెద్దలు కూడా బాగుందని ప్రశంసించారు. ఈ సినిమా ద్వారా రామ్ అగ్నివేశ్ హీరోగా పరిచయం అవుతున్నారు. దర్శకురాలు ఋషిక అనుకున్న దానికంటే సినిమాని చాలా చక్కగా తీశారు. చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ, 'హీరో రామ్ అగ్నివేశ్ చాలా బాగా నటించారు. మా సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసిన ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇది' అని అన్నారు. రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ ఫిదా, కెప్టెన్ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల.