Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా కారణంగా తాత్కాలికంగా థియేటర్లు మూతపడ్డాయంతే. దీనివల్ల థియేటర్ వ్యవస్థ కనుమరుగైపోతుందనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. ప్రేక్షకులెప్పుడూ థియేటర్లలోనే సినిమాలను చూడ్డానికి ఇష్టపడతారు. అందుకే 'బారుఫ్రెండ్ ఫర్ హైర్', 'హౌస్ అరెస్ట్' చిత్రాలకు మంచి ఓటీటీ ఆఫర్లు వచ్చినా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాం' అని అంటున్నారు ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ అధినేత కె.నిరంజన్ రెడ్డి.
'బారుఫ్రెండ్ ఫర్ హైర్', 'హౌస్ అరెస్ట్' చిత్రాలతోపాటు మరో మూడు సినిమాలను నిర్మిస్తున్న నిర్మాత కె.నిరంజన్‌రెడ్డి పుట్టినరోజు నేడు (గురువారం). ఈ సందర్భంగా ఆయన మీడియాతో సంభాషించిన విశేషాలు..
'మాది నల్గొండ జిల్లా. హైదరాబాద్‌లోనే పుట్టి,పెరిగాను. ఇంజనీరింగ్ పూర్తయ్యాక మాస్టర్స్ చేయడానికి యుఎస్ వెళ్లాను. అది కంప్లీట్ అయ్యాక రెండేళ్లు జాబ్ చేసి, ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడా రాణించాను. సినిమా అనేది మన లైఫ్‌లో ఒక భాగం. అలా నాకు సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. దీంతో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ని స్థాపించి నిర్మాణరంగంలోకి ఎంటర్ అయ్యాను. భవిష్యత్తులో ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెడ్తాం. అలాగే సొంతంగా ఒక ఓటీటీ పెట్టే ఆలోచన కూడా ఉంది. నా ఆలోచనలు ఎగ్జిక్యూట్ చేయటానికి ఓ మంచి టీమ్ కుదిరింది. మా ప్రజెంటర్ చైతన్య, నా భాగస్తుడు అశ్రిన్ రెడ్డికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఇక్కడ ప్రొడక్షన్ వ్యవహారాలు వాళ్లే చూసుకుంటారు. టైమ్‌కి పూర్తి వ్యాల్యూ ఇస్తాం. కాబట్టే ఒక ఎడాదిలోనే మూడు సినిమాలు చేయగలిగాం. మరో మూడు ప్రాజెక్ట్స్ చేయబోతున్నాం. మేం నిర్మించిన 'హౌస్ అరెస్ట్' చిత్రాన్ని థియేటర్స్ ఓపెన్ అవ్వగానే రిలీజ్ చేస్తాం. చిన్నపిల్లల మీద సినిమా వచ్చి చాలా రోజులైంది. తప్పకుండా కుటుంబ ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తారు. దీని తర్వాత రెండు వారాలకు 'బారుఫ్రెండ్ ఫర్ హైర్' చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది పూర్తి రోమ్ కామ్ సబ్జెక్ట్. వీటితో పాటు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో సూపర్‌హీరో మూవీ 'హను-మ్యాన్'ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. మా బ్యానర్లో వచ్చే ప్రతి సబ్జెక్ట్ కచ్చితంగా కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు తీస్తున్నాం. 'స్పైడర్‌మ్యాన్', 'బ్యాట్‌మ్యాన్' తరహాలో 'హను-మ్యాన్' కూడా క్లీన్ యు ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా ఎంజారు చేస్తారు. కొత్త కంటెంట్ ఉండాలి అనేది మా ఎజెండా. ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరైనా మా వెబ్సైట్లో ఉన్న ఈమెయిల్‌కు వాళ్ల స్క్రిప్ట్ సినాప్సిస్ మాకు పంపొచ్చు. గ్యారెంటీగా మేం రెస్పాండ్ అవుతాం. గతేడాదిగా దాదాపు 200 మంది కొత్త టెక్నీషియన్స్ మమ్మల్ని రీచ్ అయ్యారు. ఈ కరోనా కారణంగా థియేటర్స్ మూతపడ్డం బాధాకరమైన విషయం. అయితే యూఎస్ లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీలో కూడా ప్రేక్షకులు సినిమాని థియేటర్లలో చూడటానికే ఇష్టపడతారు. ఎప్పటికీ థియేటర్సే కింగ్. థియేటర్స్ త్వరలోనే మళ్లీ యధావిధిగా నడుస్తాయి' అని చెప్పారు.