Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మెహరీన్ హీరో, హీరోయిన్లుగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'. వి సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'నాయకానాయికలుగా సంతోష్ శోభన్, మెహరీన్ ఇద్దరూ..మమేకంగా ఒకరినొకరు చూసుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి సర్వత్రా మంచి స్పందన లభిస్తోంది. అలాగే 'మంచి రోజులు వచ్చాయి' టైటిల్ కూడా చాలా బాగుందంటూ ప్రశంసలొస్తున్నాయి. 'టాక్సీవాలా' వంటి హిట్ సినిమా తర్వాత ఎస్.కె.ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ సంస్ధ, ఎస్.కె.ఎన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. 'ఏక్ మినీ కథ' లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్లో సంతోష్ శోభన్ మరోసారి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాత: వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మారుతి.