Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం 'చరిత కామాక్షి'. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజనీ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు స్త్రీ లంక చందు సాయి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్ర ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రజనీరెడ్డి మాట్లాడుతూ, ''చరిత కామాక్షి' అనే టైటిల్‌తోనే అందరి దష్టిని ఆకర్షించడంతో పాటు రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రాబోతుందని ప్రకటించడంతో ఇండిస్టీ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 'నా జీవితం పువ్వులా మారితే.. నీ జడలోని మల్లెనై మరణించాలని ఉంది కామాక్షి..' అంటూ నాయకానాయికలు నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాదలు స్టిల్‌తో పొయెటిక్ ఫీల్ వచ్చేలా ఈ ఫస్ట్‌లుక్‌ని దర్శకులు స్త్రీ లంక చందు సాయి డిజైన్ చేశారు. యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంపూర్ణంగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు స్త్రీ లంక చందు సాయి తెరకెక్కించారు' అని చెప్పారు.
పృథ్వీ రాజ్, మణికంఠ వారణాశి, సునితా మనోహర్, సతీష్ సారిపల్లి, అంజి మామా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రాకీ వనమాలి, సంగీతం: అబు, ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్, రచన: జ్ఞానేశ్వర్ దేవరపాగ, శివ శంకర్ చింతకింది, పాటలు: కూచి శంకర్, మనోహర్ పాలిసెట్టి, వాసు వలబోజు, జ్ఞానేశ్వర్ దేవరపాగ, ఆర్ట్ డైరెక్టర్: రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఎం.ఎస్.కె.