Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందుతున్న సినిమా '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్.ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ ఈ చిత్రనిర్మాణంలో భాగస్వాములు. గురువార ఈ సినిమా పోస్టర్ని రిలీజ్ చేేశారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా, మెహర్ చావల్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ, 'జూన్ 21న హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ స్టార్ట్ చేశాం. నాన్‌స్టాప్‌గా 22 రోజులు చిత్రీకరణ చేశాం. ఈ నెలాఖరున అవుట్డోర్ షెడ్యూల్ కోసం ప్రయాణమవుతాం. జూలై 28 నుంచి 20 రోజుల పాటు కంటిన్యూస్‌గా బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో చిత్రీకరణ చేస్తాం. పాటలకు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉంది. గిలిగింతలు పెట్టే కథాంశం ఇది. సహజత్వానికి దగ్గరగా ఉండే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. 'డర్టీ హరి' తర్వాత మా నాన్న ఎం.ఎస్.రాజుగారు చేేస్తున్న ఈ సినిమా చాలా అద్భుతంగా వస్తోంది' అని అన్నారు. దర్శకుడు ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ, ''డర్టీ హరి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, అందుకు భిన్నంగా వేరే రీతిలో ఉండే చిత్రమిది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరచే విధంగా, చక్కటి జాలీ ట్రిప్‌లా ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయి. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అన్నట్టు కాకుండా మన కళ్ల ముందు కదలాడే సజీవ పాత్రల్లా హీరో, హీరోయిన్ల పాత్రలు ఉంటాయి. ఇప్పటికి 60 శాతం సినిమా పూర్తయింది' అని తెలిపారు.